దేవుడి కన్నా భక్తే గొప్ప!

19 Feb, 2014 23:06 IST|Sakshi
దేవుడి కన్నా భక్తే గొప్ప!

 తారకరత్న, అర్చన నాయకా నాయికలుగా ముద్దపు రాంబాబు దర్శకత్వంలో వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘మహాభక్త సిరియాళ’. శివరాత్రి పండగ సందర్భంగా ఈ 27న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పాటలకు ప్రేక్షకాదరణ లభించిన నేపథ్యంలో బుధవారం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘భగ వంతునికన్నా భక్తే గొప్పదనే కథాంశంతో ఈ సినిమా నిర్మించాం. అన్ని వర్గాలవారికి నచ్చే సినిమాగా దర్శకుడు తెరకెక్కించారు. పదిహేను నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు.
 
  ఈ వేడుకలో పాల్గొన్న సముద్ర, టి. ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ సినిమా విజయం సాధించాలని అభిలషించారు. తారకరత్న, అర్చన సినిమా విజయం సాధిం చాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి