మహేష్‌..!

1 Jun, 2017 23:11 IST|Sakshi
మహేష్‌..!

సింగిల్‌ డైలాగ్‌ చెప్పలేదు. ఒక్క సాంగ్‌ వినిపించలేదు. ఫైట్‌ సీన్‌ కనిపించలేదు. రొమాన్స్‌ లేదు. అయినా ‘స్పైడర్‌’ టీజర్‌ మాత్రం అదిరిపోయింది. సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌తో టీజర్‌ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు మహేశ్‌బాబు.  ఏఆర్‌ మురుగదాస్‌ డైరెక్షన్‌లో మహేశ్‌బాబు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ‘స్పైడర్‌’ టీజర్‌ గురువారం విడుదలైంది.

రిలీజైన ఐదు గంటల్లోనే 20 లక్షల వ్యూస్‌తో పాటు, 1 లక్షా 20 వేల లైక్స్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌ ఆల్‌ టైమ్‌ రికార్డును ఈజీగా దక్కించేసుకుందని చిత్రబృందం పేర్కొంది. మెటల్‌ బాక్స్‌ రోబో స్పైడర్‌గా మారి, కంప్యూటర్‌ వర్క్‌లో లీనమైన మహేశ్‌ దగ్గరకు రావడం, దాన్ని చూసి, మహేశ్‌ ‘ష్‌’ అనగానే అది సైలెంట్‌ అయిపోవడం, అప్పుడు వచ్చే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అంతా బాగుందని మహేశ్‌ ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

వచ్చేటప్పుడు ఆ రోబో స్పైడర్‌ మూమెంట్, డిజైన్‌ అండ్‌ లుక్‌ అన్నీ సూపర్‌గా ఉన్నాయంటున్నారు. ఈ చిత్రానికి హ్యరీస్‌ జైరాజ్‌ స్వరకర్త.  ప్రస్తుతం చెన్నైలో లాస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్న ‘స్పైడర్‌’ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుంది.