సర్కార్‌వారి పాట?

28 May, 2020 03:35 IST|Sakshi
మహేశ్‌బాబు

‘సర్కార్‌ వారి పాట’ ఫైనలైజ్‌ అయిందా? అని చర్చించుకుంటున్నారు మహేశ్‌బాబు అభిమానులు. మహేశ్‌ బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేశ్‌ కెరీర్‌లో ఇది 27వ సినిమా. సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌ డే (మే 31) సందర్భంగా ఈ సినిమా లాంచ్‌ అవుతుందని సమాచారం. ఈ సినిమాకు ‘సర్కార్‌వారి పాట’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ లేటెస్ట్‌ టాక్‌. సినిమా ప్రారంభోత్సవం రోజు టైటిల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. అలాగే ఈ సినిమాకు కథనాయికగా కియారా అద్వానీ, స్వరకర్తగా తమన్‌ ఎంపికయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా