Bigg Boss 7 Telugu: ఈ సీజన్ కాబోయే విన్నర్ అతడేనా? ఒకవేళ లెక్కలు మారితే!

6 Dec, 2023 19:24 IST|Sakshi

బిగ్‌బాస్ 7వ సీజన్ చివరకొచ్చేసింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తోండగా, మరో 10 రోజుల్లో షో పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరవుతారనే కుతుహలం ఉండటం పక్కా. అందుకు తగ్గట్లే నిర్వహకులు.. ఉన్న ఏడుగురితో గేమ్స్ అవీఇవీ అని టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురే ఉన్నారు.

(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)

మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్ అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండానే సాగుతోంది. శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం తప్పితే ఓ ఎంటర్‌టైన్‌మెంట్ సరిగా లేదు, ఓ లవ్ ట్రాక్ లేదు. ఎమోషనల్‌గా ఫీలయ్యే సంఘటన లేదు. ఎలాగోలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు తప్పితే చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఏదైతేనేం షో చివరకు వచ్చేశాం. విజేత ఎవరనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది.

అయితే గడిచిన వీకెండ్ సందర్భంగా నిర్వహకులు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ రెండు వారాలు కూడా ఓటింగ్ లైన్స్ తెరుచుకునే ఉంటాయని, ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్.. బిగ్‌బాస్ 7 విజేతగా నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటింగ్ నంబర్స్ చూసుకుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 34 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?)

ప్రశాంత్ తర్వాత శివాజీ, అమర్‌దీప్ దాదాపు 20 శాతం ఓటింగ్ పర్సంటేజ్‌తో ఉన్నారు. ఆ తర్వాత వరసగా యావర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులోని తొలి ముగ్గురిలోనే స్థానాలు అటుఇటు మారాలి తప్పితే మిగతా వాళ్లు.. టాప్-3లోకి వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే ప్రశాంత్, శివాజీ, అమర్‌లలో ఎవరో ఒకరే విజేత అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి.

ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేత అని బిగ్‌బాస్ నిర్వహకులు చెప్పారు. కానీ రాబోయే 10 రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెక్కలు మార్చొచ్చు. ఎన్ని లెక్కలు మారినా సరే ప్రశాంత్ లేదంటే అమర్ విజేత అయితే పెద్దగా సమస్య ఉండదు. శివాజీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతావాళ్లతో పోలిస్తే.. మనోడు చాలా విషయాల్లో పూర్. ఏదో మాటలతో లాక్కోచ్చేస్తున్నాడు అంతే! ఏదైతేనేం టైటిల్ కోసం పోటీ మంచిగా నడుస్తోంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరనుకుంటున్నారు?

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్‌!)

>
మరిన్ని వార్తలు