యాక్టర్‌ టు డైరెక్టర్‌

23 Jan, 2020 01:15 IST|Sakshi
పార్వతి

పార్వతి.. ప్రస్తుతం ఉన్న మలయాళ యాక్టర్స్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ ఆర్టిస్ట్స్‌. పోషించే పాత్రలను సహజంగా ఉండేలా చూసుకుంటారామె. ‘బెంగుళూర్‌ డేస్, ఉయిరే’ వంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ ఏడాది పార్వతి యాక్టర్‌ నుంచి డైరెక్టర్‌గా మారబోతున్నారని తెలిసింది. ఆర్టిస్ట్‌గా  అంగీకరించిన సినిమాలన్నీ ఈ ఏడాది చివర్లోగా పూర్తి చేసి, తాను దర్శకత్వం వహించే సినిమా ప్రీ– ప్రొడక్షన్‌ పనులను మొదలుపెట్టనున్నారు పార్వతి. 2021లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కథకు ఆమె ఒక రచయితగానూ వ్యవహరించనున్నారు. 

మరిన్ని వార్తలు