భయపెట్టే పిండం!

20 Nov, 2023 04:27 IST|Sakshi
ఖుషీ రవి, శ్రీరామ్‌

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్‌ దైదా దర్శకత్వం వహించిన హారర్‌ ఫిల్మ్‌ ‘పిండం’. ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

‘‘ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం. స్క్రీన్  ప్లే హైలైట్‌గా ఉంటుంది. డిసెంబరు 7న ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కృష్ణ సౌరభ్‌ సూరంపల్లి సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు