అబ్బాయి మిడిల్‌ క్లాస్‌.. వసూళ్లు హైక్లాస్‌

22 Dec, 2017 19:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి(ఎంసీఏ) బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్నాడు. తొలి రోజే భారీ వసూళ్లతో సత్తా చాటాడు. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని కెరీర్‌లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించినట్టు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 11 కోట్ల గ్రాస్‌ వసూళ్లు వచ్చినట్టు తెలిపాయి. ఆస్ట్రేలియాలో రూ.15.47 లక్షలు రాబట్టినట్టు బాలీవుడ్‌ మార్కెట్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ ఓపెనింగ్ కలెక్షన్లు భారీగా ఉండటం విశేషం. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ధియేటర్లు 70 శాతం వరకు నిండాయని సమాచారం. దిల్‌ రాజు నిర్మాత కావడం, పబ్లిసిటీ బాగా చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. కలెక్షన్ల జోరు ఇదేవిధంగా కొనసాగితే నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఎంసీఏ నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి నటించింది. భూమిక, రాజీవ్ కనకాల, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

సినిమా

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం