బ్రూస్లీ సెట్లో మెగాస్టార్

1 Oct, 2015 09:26 IST|Sakshi
బ్రూస్లీ సెట్లో మెగాస్టార్

ఫైనల్గా చిరు 150వ సినిమా ఏదన్నది తేలిపోయింది. ఈ సారికి సోలో హీరోగా కాకుండా అతిథి పాత్రలోనే సరిపెట్టేస్తున్నాడు మెగాస్టార్. రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న బ్రూస్లీలో మూడు నిమిషాల పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం మూడు రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చిన చిరు ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ను పూర్తి చేశాడు.

అయితే చిరు రీ ఎంట్రీకి సంబంధించిన లుక్ విషయంలో చిత్రయూనిట్ చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల విరామం తరువాత వెండితెర మీద దర్శనమిస్తున్న చిరు లుక్ ఎలా ఉండబోతుందో వెండితెర మీదే చూడాలంటున్నారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరు లుక్కి సంబందించిన ఓ ఫొటో హల్చల్ చేస్తుంది.

గ్యాంగ్లీడర్ సినిమా టైంలో చిరు ఎలా ఉండేవాడో దాదాపు అదే డ్రెసింగ్ స్టైల్, లుక్తో ఉన్న చిరంజీవి సెట్ లో ఉన్నఫొటో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. బ్లాక్ జాకెట్ తో కనిపిస్తున్న చిరు.. కుర్ర హీరోలకు పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడేమో అన్నట్టుగా ఉంది ఈ ఫొటో. అయితే ఇది బ్రూస్లీ సినిమా సెట్లోదేనన్న ప్రచారం జరుగుతున్నా చిత్రయూనిట్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి