వశిష్ఠతో చిరంజీవి జర్నీ ప్రారంభం ఎప్పుడంటే..?

17 Nov, 2023 08:45 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో వస్తున్న మెగా 156 సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ భారీ బడ్జెట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయిందట. బింబిసార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్‌ హిట్‌ కొట్టిన వశిష్ఠ చాలా గ్యాప్‌ తీసుకుని పక్కా ప్లాన్‌తో చిరంజీవి కోసం కథ రెడీ చేశాడు. UV క్రియేషన్స్‌ ద్వార  విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నవంబర్‌ 25 నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రానుంది. షూటింగ్‌ ప్రారంభమే భారీ యాక్షన్‌ సీన్స్‌తో మొదలు కానుందట.. ఈ కథలో ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఊహకందని యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట ఈ సినిమా గురించి ఇలా తెలిపారు. 'చిరంజీవిగారు పూర్తి స్థాయి ఫాంటసీ కథలో నటించి చాలా రోజులైంది. అందుకే ఆయన కోసం పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలబోసి అద్భుతమైన కథను సిద్ధం చేశా.' అని హింట్‌ ఇచ్చారు.

విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారులను మెచ్చే అంశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ ఆమెకు అంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చినా ప్రముఖంగా అనుష్క పేరు వినిపిస్తోంది. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఈ విజువల్‌ వండర్‌ను కెమెరామెన్‌ ఛోటా కె. నాయుడు చిత్రీకరించనున్నారు.

మరిన్ని వార్తలు