నువ్వూ నేనూ సేమ్‌ రా అనుకున్నాను

13 Dec, 2019 00:15 IST|Sakshi
వెంకటేష్

మల్టీస్టారర్‌ సినిమాలు సౌకర్యంగా ఉంటున్నాయి కాబట్టే చేస్తున్నాను. కంఫర్ట్‌ లేకపోతే ఎందుకు చేస్తాను? ఇద్దరి యాక్టర్స్‌కి మధ్య వాతావరణం సరిగ్గా లేకపోతే అది సెట్లోనూ బావుండదు. స్క్రీన్‌ మీద అస్సలు బావుండదు. షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లినప్పుడు హ్యాపీగా వెళ్లాలి కానీ ఈ హీరో ఉన్నాడా? మన స్క్రీన్‌ టైమ్‌ ఎంత అనే ఆలోచనలతో కాదు.

నటుడిగా 33 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఎంజాయ్‌ చేయకపోతే ఉపయోగం ఏంటి?’’ అన్నారు వెంకటేశ్‌. నేడు ఆయన పుట్టిన రోజు. నాగచైతన్యతో కలసి వెంకటేశ్‌ నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘వెంకీ మామ’. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌  నిర్మించారు. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా వెంకటేశ్‌ చెప్పిన విశేషాలు.  

►నేను, నాగచైతన్య.. ఆ తర్వాత నేను, రానా కలసి నటించాలన్నది నాన్న గారి కోరిక. అలాగే మేమందరం కలసి ఓ సినిమా చేయాలనుకున్నారు ఆయన. అప్పుడు మాకు తగ్గ కథలు కుదర్లేదు. చైతన్య, నేను కలిసి యాక్ట్‌ చేయడం ఇప్పటికి కుదిరింది. చైతూతో నటించడం హ్యాపీగా, థ్రిల్లింగ్‌గా అనిపించింది.

►‘వెంకీ మామ’ కేవలం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మాత్రమే కాదు. కథలో, పాత్రల్లో చాలా లోతు ఉంటుంది. యాక్షన్, ఎమోషన్‌ అన్నీ సమపాళల్లో పక్కా కమర్షియల్‌ సినిమాలా ప్యాక్‌ చేశాం.  

►చిన్నప్పుడు పిల్లలందరిలో మాకు ఫేవరెట్‌ చైతన్యే. చాలా బొద్దుగా ఉండేవాడు. అందరం వాణ్ణి బాగా ముద్దు చేసేవాళ్లం. యాక్టర్‌గా చైతన్య చాలా నేర్చుకుంటున్నాడు. తను ఇంకా మంచి సినిమాలు చేయాలి. వేరే వాళ్లతో పోల్చుకోకుండా తనతో తను పోటీపడి, ప్రొఫెషన్‌తో నిజాయతీగా ఉంటూ పని చేసుకుంటూ వెళ్లాలి.  

►చైతూ, నేను ఇంట్లో కలవడం వేరు.. సెట్లో యాక్ట్‌ చేయడం వేరు. మామా అల్లుళ్లుగా ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయాలి. ఈ సినిమా షూటింగ్‌ మొదటివారంలో నేను చైతూని గమనిస్తూ ఉండేవాణ్ని. కామ్‌గా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ‘ఏమనుకుంటున్నావు రా నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు?’ అనుకునేవాణ్ణి (నవ్వుతూ). కానీ వాడు నాలానే కామ్‌గా ఉండటం గమనించాను. ‘నువ్వూ నేనూ సేమ్‌ రా’ అనుకున్నాను.  మామ లొకేషన్‌కి 9కి వస్తున్నాడని 8.45కే వచ్చేవాడు. నడక, ఆ స్టయిల్‌తో పాటు ఏదో ఆలోచించడం కూడా మేనమామ (చైతూకి వెంకీ మేనమామ) పోలికే వచి్చ నట్టుంది (నవ్వుతూ).  

►చైతన్యకి చిన్నప్పుడు యాక్టింగ్‌ మీద ఆసక్తి లేకపోయినా యాక్టర్‌ అయ్యాడు. నేను, రానా కూడా అనుకోకుండా నటనలోకి వచ్చాం. అయినప్పటికీ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు. తెలుగు సినిమా అభిమానులు చాలా స్పెషల్‌. నచి్చతే ఏ సినిమా అయినా చూస్తారు. యాక్టర్స్‌ను విపరీతంగా ప్రేమిస్తారు. మధ్యలో ఫ్లాప్స్‌ వచ్చినా, ఆ హీరో నుంచి హిట్‌ సినిమా వస్తే మళ్లీ తప్పకుండా చూస్తారు. నేను జీవితంలో ప్రతిరోజూ బోనసే అనుకుంటాను. దేవుడు నా పట్ల చాలా దయగా ఉన్నాడనుకుంటాను. దానికి తగ్గట్టు కష్టపడుతుంటాను. అప్పుడే అందరూ ‘యాక్టర్‌గా ఇంకా వీడిలో ఏదో ఉంది’ అనుకుంటారు. లేకపోతే ఇండస్ట్రీ

►33 ఏళ్లల్లో ఫస్ట్‌ టైమ్‌ నా బర్త్‌డేకు రిలీజవుతున్న సినిమా ఇదే. సినిమా రిలీజ్‌ ఉండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఏం ప్లాన్‌ చేయలేదు.  

►మలీ్టస్టారర్‌ చిత్రాలు ఆడుతున్నాయి కాబట్టి చేస్తున్నాను. వరుసగా రెండు సినిమాలు పోయాయనుకోండి, మలీ్టస్టారర్స్‌ ఎక్కువ అయిపోయాయి అంటారు. కొన్ని సినిమాలు సోలోగా చేయండి అంటారు. యంగ్‌ యాక్టర్స్‌లో ఎనీ్టఆర్‌తో  చేయాలనుంది. నానీతో చేయాల్సింది, కానీ కుదర్లేదు.

►నాన్నగారు ప్యాషనేట్‌. సినిమాలే జీవితం అన్నట్లు జీవించారు. ఆయనతో పోలిస్తే మాకు ఉన్న ప్యాషన్‌ చాలా తక్కువ అనిపిస్తుంది. తెలియకుండానే సినిమా గురించి నాకు చాలా నేరి్పంచారు. ఆయన్ని మించిన గొప్ప టీచర్‌ లేరు.

►‘అసురన్‌’ రీమేక్‌ జనవరిలో స్టార్ట్‌ అవుతుంది. 3–4 నెలల్లో పూర్తవుతుంది. సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తాం. శ్రీకాంత్‌ అడ్డాల మంచి కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని కసి మీద ఉన్నాడు. నాక్కూడా ఆ పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుంది. వరుసగా కామెడీ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తున్నాను కదా ఈ సినిమా మార్పులా కూడా ఉంటుంది.

►ప్రస్తుతం ప్రపంచంలో కొంచెం నెగటివిటీ ఉంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా, పెద్దగా పట్టించుకోక పోయినా ఒక్క తప్పు చేస్తే దాన్నే ఎత్తి చూపుతారు. అది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. సంతోషంగా ఉండండి. ప్రతిదీ సీరియస్‌గా తీసుకోవద్దు. అందరం పాజిటివ్‌గా ఉందాం. అందరూ బావుండాలి అని కోరుకుందాం. ఆనందమైన ప్రపంచాన్ని కోరుకుంటుంటాను. ఇంకేం కావాలి?   

►ఎప్పటినుంచో యాక్టింగ్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకోవాలి అనుకుంటున్నాను. అన్నయ్యవాళ్లు వదలడం లేదు. ఏదో రోజు జంప్‌ అయిపోతాను.  

►నేను వెబ్‌ సిరీస్‌లోకి కూడా వచ్చేస్తున్నాను. ‘వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేయండి’ అని ఎవరో ఒకరు వచ్చి అడగడం ఎందుకు? నేనే దర్శకులను అడుగుతాను. నాకోసం ఏదో ఒకటి రాయండి. వెబ్‌ సిరీస్‌ కథలు తీసుకు రండి చేద్దాం అని.  

►స్క్రీన్‌ టైమ్‌ ఎంత అని ఆలోచించకుండా కథకు తగ్గట్టు నటించాలి. నా స్క్రీన్‌ టైమ్‌ ఎంత? అని ఆలోచిస్తే సినిమాలు చేయలేం. గతంలో సూపర్‌స్టార్స్‌ని గమనిస్తే నాగేశ్వరావుగారు, కృష్ణగారు, శోభనబాబుగారు స్క్రీన్‌ టైమ్‌ పట్టించుకోకుండా పాత్రలు చేశారు. చాలెంజింగ్‌ యాక్టర్స్‌లా ఉండాలి. ప్రస్తుతం యంగ్‌ హీరోలతో చేస్తున్నాను. వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ గమనిస్తుంటాను.

మరిన్ని వార్తలు