ఆ స్వరాలు విన్నప్పుడు సర్వస్వం మర్చిపోతాను

21 Jun, 2014 00:16 IST|Sakshi
ఆ స్వరాలు విన్నప్పుడు సర్వస్వం మర్చిపోతాను

అనూప్ రూబెన్స్
మీకిష్టమైన పాట ఏది? అని ఎవరినైనా అడిగితే, కాసేపైనా ఆలోచిస్తారు. నేను మాత్రం ఒక్క క్షణం కూడా తడుముకోకుండా ‘మాటే మంత్రము..’ పాట గురించి చెప్పేస్తాను. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఆ పాట. నాతో పాటే, ఆ పాటపై అభిమానం కూడా పెరుగుతూ వస్తోంది. పదేళ్ల తర్వాత మీరు ఈ ప్రశ్న అడిగినా, నా నుంచి వచ్చే సమాధానం ఈ పాటే. అంతలా నాలో లీనమైపోయిందీ పాట. ఇళయరాజాగారు ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారని.

అసలు ఇలాంటి పాటను సృష్టించడమే చాలా కష్టం. ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది. ఎవరెస్ట్ లాంటి సాంగ్ ఇది. ఈ పాట కోసమే ‘సీతాకోక చిలుక’ లెక్కలేనన్ని సార్లు చూశాను. ఈ పాటలోని స్వరాలు వింటుంటే సర్వస్వం మరచిపోతుంటాను. ఇక, హిందీలో అయితే ‘జబ్ కోయీ బాత్ బిగడ్ జాయే..’ అంటే చాలా ఇష్టం. ‘జుర్మ్’ (1990) సినిమాలోనిదా పాట. నా ఫేవరెట్ మ్యూజిక్ డెరైక్టర్ రెహమాన్. సింగర్స్ అంటే శ్రేయా ఘోషల్, అరిజీత్ సింగ్ అంటే ఇష్టం.