సెన్సార్‌ ఆలస్యం చేస్తున్నారు

9 Jan, 2020 02:13 IST|Sakshi
రాజ్, ఆకర్షిక

రాజ్‌ సూరియన్‌ హీరోగా ఆకర్షిక, నస్రీన్‌ హీరోయిన్లుగా అశ్విన్‌ కృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘నా పేరు రాజా’. రాజ్‌ సూరియన్, ప్రభాకర్‌ రెడ్డి, కిరణ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. రాజ్‌ సూరియన్‌ మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా ‘తిరుగుబోతు, జటాయువు’ సినిమాలు చేశాను. ఇప్పుడు చేసిన ‘నా పేరు రాజా’ కన్నడలో సెన్సార్‌ పూర్తయింది.. కానీ, తెలుగులో మాత్రం సెన్సార్‌ ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారు. వరుస ప్రకారం కాకుండా వెనక వచ్చిన పెద్ద సినిమాలకు సెన్సార్‌ ఇస్తున్నారు.

అనుకున్న ప్రకారం సెన్సార్‌ పూర్తయితే ఈ నెల 31న సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా మూడో సినిమా. ఇటీవల విడుదల చేసిన లిరికల్‌ వీడియోస్‌కి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు ప్రభాకర్‌ రెడ్డి. ‘‘డైరెక్టర్‌గా ఇది నా తొలి సినిమా. ఉపేంద్ర , మురళీమోహన్‌గార్ల వద్ద దర్శకత్వ శాఖలో 20 ఏళ్లుగా పని చేస్తున్నా. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. అన్ని రకాల వాణిజ్య అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాం’’ అన్నారు అశ్విన్‌ కృష్ణ. కెమెరామేన్‌ వెంకట్, నస్రీన్, ఆకర్షిక మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్విన్‌ జాషువా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పలాస 1978 మంచి చిత్రమని ధైర్యంగా చెప్పగలం

అనంతపురంలో అసురన్‌

నా కల నిజమవుతోంది

నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే

నన్ను తిట్టుకుంటారనుకున్నాను!

సినిమా

పలాస 1978 మంచి చిత్రమని ధైర్యంగా చెప్పగలం

అనంతపురంలో అసురన్‌

నా కల నిజమవుతోంది

నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే

నన్ను తిట్టుకుంటారనుకున్నాను!

‘అడిగి ఐ లవ్యూ చెప్పించుకోకూడదు’