పేరు చెడగొట్టకూడదనుకున్నాను

10 Aug, 2019 07:44 IST|Sakshi
నాగ్‌ అశ్విన్‌

నేషనల్‌ లెవల్లో గుర్తింపు రావడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ‘మహానటి’కి మూడు అవార్డులు వచ్చాయి. నేషనల్‌ లెవల్లో గట్టి పోటీ ఇచ్చిన కీర్తీ సురేశ్‌ అవార్డు  సాధించడం సంతోషంగా ఉంది. సావిత్రిగారి టైమ్‌లో ఆమెకు నేషనల్‌ అవార్డు  రాలేదు. కానీ అవార్డ్‌కు తగినంత పెర్ఫార్మెన్స్‌లు చాలా ఇచ్చారు. ఆమె మీద తీసిన సినిమాతో నేషనల్‌ అవార్డు తీసుకురాగలిగాం. ఇది ఊహించలేదు. కానీ మంచి ప్రశంసలు, అభినందనలు వస్తాయని చాలా మంది చెప్పారు. సినిమా రిలీజ్‌ అయి కూడా చాలా రోజులైంది. మర్చిపోయాను కూడా. సినిమాలో చాలెంజ్‌లు, కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాతో మాకు బాధ్యత ఎక్కువ ఉండేది. సావిత్రి అమ్మ మీద సినిమా తీస్తున్నాం. అవకాశాన్ని వృథా చేసుకోకూడదు అని కష్టపడ్డాం.

సావిత్రిగారికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లు మా సినిమా చూస్తే సంతృప్తి చెందాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. బాక్సాఫీస్‌ గురించి కూడా ఎక్కువగా ఆలోచించలేదు. రిలీజ్‌ అయిన తర్వాత ‘న్యాయం చేశారు, చెడగొట్టలేదు’ అంటే చాలు అనుకున్నాను. ఆమె లైఫ్‌ అంతా షూటింగ్‌ గ్యాప్‌లో జరిగిందే కదా. సమస్య అయినా ప్రేమ అయినా షూటింగ్స్‌ మధ్యలోనే జరిగాయి. సినిమా కూడా అలానే తీశాను. మనకు చాలా కథలున్నాయి. వాళ్లందరి గురించి కూడా సినిమాలు తీయాలి. తీసేవాళ్లు మాత్రం చాలా నిజాయితీగా వెతికి, నిజాయితీగా తీయాలి. నెక్ట్స్‌ కొత్త కథలు చెప్పాలనుంది. ప్రస్తుతం ఓ కథను రాస్తున్నాను. తొందర తొందరగా సినిమా తీసేయాలని లేదు. ఇప్పుడు చేయబోతున్న సినిమా మాత్రం నా గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు