మాఫియా నేపథ్యంలో...

27 Aug, 2018 05:42 IST|Sakshi
అరవింద స్వామి, శింబు

మణిరత్నం.. ఈ పేరు చెప్పగానే ‘గీతాంజలి, బాంబే, రోజా, సఖి, ఘర్షణ, దళపతి, యువ’ వంటి ఎన్నో హిట్‌ చిత్రాలు గుర్తొస్తాయి. ప్రేమకథలే కాదు.. మెసేజ్‌ ఓరియంటెడ్‌ ఎమోషనల్‌ చిత్రాలను తెరకెక్కించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నవాబ్‌’. అరవింద స్వామి, జ్యోతిక, అరుణ్‌ విజయ్, ఐశ్వర్యా రాజేశ్, శింబు, విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌ రాజ్‌. త్యాగరాజన్‌ ప్రధాన తారలుగా లైకా ప్రొడక్షన్స్‌ సమర్పణలో మద్రాస్‌ టాకీస్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నాగార్జున విడుదల చేశారు.

లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ– ‘‘మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మంచి యాక్షన్‌ ప్యాక్డ్‌గా ఉంటూనే ఎమోషనల్‌ కంటెంట్‌తో సాగుతుంది. నాగార్జునగారు రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ ఇప్పటికే వన్‌ మిలియన్‌ వ్యూస్‌ను రాబట్టుకుని సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. టాప్‌ టెక్నీషియన్స్‌ సహకారంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ పకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్, కెమెరా: సంతోష్‌ శివన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ ఆనంది, నిర్మాతలు: మణిరత్నం, సుభాష్‌ కరణ్‌.

మరిన్ని వార్తలు