లేడీ అఘోరా!

23 Jan, 2016 01:00 IST|Sakshi
లేడీ అఘోరా!

వెండితెరపై నమిత కనిపించి దాదాపు నాలుగైదేళ్లు అయిపోయింది. ఈ బ్రేక్‌కి కారణం నమిత బరువు అని చెప్పొచ్చు. బొద్దుగా ఉన్నప్పుడు నమిత బాగానే ఉన్నా.. ఆ బొద్దు హద్దు దాటడంతో అవకాశాలు తగ్గాయి. అందుకే నమిత తగ్గారు. వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్ తీసుకుని, తగ్గిన నమిత ఆ మధ్య ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈవిడగార్ని చూసినవాళ్లందరూ ‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అని కితాబులిచ్చేశారు. ఇప్పుడు నమితకు అవకాశాలు కూడా మొదలయ్యాయి. ఇన్నేళ్ల విరామం తర్వాత ఆమె అంగీకరించిన మొదటి చిత్రం ‘పొట్టు’. ఇప్పటి వరకూ నమితను గ్లామరస్‌గా చూశాం.

ఈ తమిళ చిత్రంలో ‘లేడీ అఘోరా’గా ఆమెను చూడనున్నాం. ఇది హారర్ మూవీ. వడివుడయన్ దర్శకత్వంలో నమిత, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, ఇనియా కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కథ, పాత్ర నచ్చి నమిత అంగీకరించారు. ఇందులో నమిత చుట్ట తాగుతారట. ‘‘నిజజీవితంలో నేను చుట్ట తాగను. అందుకని, ఈ సినిమాలో నేను వాడే సిగార్‌లో బొగ్గు పొడి నింపారు. దాన్నే కాలుస్తాను.

నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను’’ అని నమిత పేర్కొన్నారు. ఈ అందాల అఘోరా పాత్ర కోసం నమిత బ్లాక్ మేకప్ వేసుకుంటున్నారు. సో.. ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో తెల్లని నమితను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు బ్లాక్ బ్యూటీని చూడనున్నారన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి