ఉత్కంఠకు గురి చేసేలా...

18 Aug, 2016 23:19 IST|Sakshi
ఉత్కంఠకు గురి చేసేలా...

టాలీవుడ్‌లో ఇప్పుడు హారర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా ‘ఎవరు’ పేరుతో మరో హారర్  చిత్రం తెరకెక్కింది. తారకరత్న, శేఖర్, యామిని, చందు ప్రధాన పాత్రల్లో రమణ సెల్వ దర్శకత్వంలో ముప్పా అంకమ్మ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకరులతో మాట్లా డారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో నారా రోహిత్ మాట్లాడుతూ-‘‘సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

వరుసగా హారర్ చిత్రాలు వచ్చి విజయం సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే అంశాలు చాలా ఉంటాయి’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత ఓ మంచి చిత్రం చేశాననే ఫీలింగ్ కలిగింది’’ అని తారకరత్న చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: లింగ శ్రీనివాసరావు.