కన్నప్పలో ఎంట్రీ 

10 Nov, 2023 04:37 IST|Sakshi
మోహన్‌బాబు, శరత్‌కుమార్‌

సీనియర్‌ నటులు మంచు మోహన్‌బాబు, శరత్‌కుమార్‌ ‘కన్నప్ప’ మూవీ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది.

హీరో ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌ వంటి స్టార్స్‌ ఈ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు మంచు మోహన్‌బాబు, శరత్‌ కుమార్‌ ‘కన్నప్ప’లో భాగమైనట్లు ప్రకటించి, వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు