బాహుబలికి సహాయ దర్శకుడిగా నాని

9 Sep, 2016 10:53 IST|Sakshi
బాహుబలికి సహాయ దర్శకుడిగా నాని

వరుస సక్సెస్లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని చేస్తున్న లేటెస్ట్ మూవీ మజ్ను. ఉయ్యాలా జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాపై వినిపిస్తున్న ఓ వార్త అంచనాలను పెంచేస్తోంది.

నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దర్శకధీరుడు రాజమౌళి అతిథి పాత్రలో నటించాడట. మజ్ను సినిమాలో నాని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నాని పనిచేసేది రాజమౌళి దగ్గరేనట. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో నాని బాహుబలి సినిమాలోని భల్లాలదేవుడి రథాన్ని తోలుతున్న స్టిల్స్ కూడా ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. మజ్ను సినిమాలో నాని రాజమౌళి దగ్గర బాహుబలి సినిమాకు సహాయ దర్శకుడిగా నటిస్తున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి