భాగ్యనగరంలో గ్యాంగ్‌లీడర్‌

3 Jul, 2019 02:25 IST|Sakshi
నాని

‘‘జీ ఏ యన్‌ జీ గ్యాంగ్, గ్యాంగ్, బచావో బ్యాంగ్‌ బ్యాంగ్‌’’ అంటూ అప్పట్లో చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రంతో ఎంతో సందడి చేశారు. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పేరుతో హీరో నాని సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నాని హీరోగా విక్రమ్‌. కె. కుమార్‌ దర్శకత్వంలో తాజా ‘గ్యాంగ్‌లీడర్‌’ రూపొందుతోంది. నాని సరసన ప్రియాంక అనే తమిళ భామ ఈ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరపై ఆరంగేట్రం చేయనుంది.

నాని 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది ‘గ్యాంగ్‌లీడర్‌’. తాజా షెడ్యూల్‌ను ఈ నెల 6న హైదరాబాద్‌లో ప్రారంభించి  20వ వరకు షూట్‌ చేస్తారు. ఈ షెడ్యూల్‌లో సినిమాకి ఎంతో కీలకమైన కొంత టాకీతో పాటు, ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తారట. రొమాంటిక్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ విలన్‌ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నాని నటించిన ‘జెర్సీ’కి స్వరాలందించిన అనిరుద్‌ రవిచంద్రన్‌ ఈ చిత్రానికి స్వరకర్త.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా