సోలోగా వస్తున్న నాని

12 Dec, 2016 15:24 IST|Sakshi
సోలోగా వస్తున్న నాని

వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నానికి టైం కూడా బాగా కలిసొస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు హిట్స్ అందించిన నాని, ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దిల్రాజు నిర్మాణంలో త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో నేనులోకల్ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ చివరలో రిలీజ్ చేస్తున్నాడు. సాధారణంగా టాలీవుడ్లో క్రిస్టమస్ సీజన్ అంటే బడా స్టార్ల సినిమాలు పోటిలో ఉంటాయి.

కానీ ఈ సారి మాత్రం పరిస్థితి అలా లేదు. సీనియర్ హీరోలందరూ సంక్రాంతికే బరిలో దిగుతుంటే, యంగ్ జనరేషన్ స్టార్లు సమ్మర్ రిలీజ్ల కోసం ప్రీపేర్ అవుతున్నారు. దీంతో క్రిస్టమస్ సీజన్లో నాని తప్ప మరే హీరో బరిలో దిగటం లేదు. రామ్చరణ్ ధృవ సినిమా క్రిస్టమస్కు రెండు వారాల ముందే రిలీజ్ అవుతుండటంతో నేనులోకల్పై పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చని భావిస్తున్నారు. ఇక నాని సినిమాకు వారం ముందే థియేటర్లలోకి వస్తున్న సూర్య, సింగం 3 ఒక్కటే నానికి పోటి అయ్యే అవకాశం ఉంది. సూర్యకు టాలీవుడ్లోమంచి ఫాలోయింగే ఉన్నా సింగం 3 పక్కా మాస్ ఎంటర్టైనర్ కావటంతో., ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న నానికి పెద్దగా పోటి కాకపోవచ్చన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.