ఆ రూమర్‌ నిజమైంది...

25 Aug, 2018 20:15 IST|Sakshi

సాక్షి, ముంబై: పెళ్లి కబురుతో అభిమానులను ఆశ్చర్యపర్చిన బాలీవుడ్‌ నటి నేహాదుపియా,  అంగద్ బేడి, జంట మరో గుడ్‌న్యూస్‌తో  ఫాన్స్‌కి స్వీట్‌ షాకిచ్చారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామనే వార్తను సోషల్‌ మీడియాలో పంచకున్నారు. తద్వారా గత కొద్దికాలంగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై వస్తున్న ఊహాగానాలకు బాలీవుడ్ తార నేహా దూపియా తెరదించినట్టయింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్‌ చేశారీ జంట. దీంతో ఇవి వైరల్‌ అయ్యాయి.
 
ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ శుభవార్తను శుక్రవారం నేహా కన్ఫామ్‌ చేశారు. కొత్త ఆరంభం.. ఇపుడు మేం ముగ్గురం.. ఆ భగవంతుడి ఆశీర్వాదం తమతో ఉందంటూ కొన్ని పోటోలను షేర్‌ చేశారు. అలాగే రూమర్లు నిజమయ్యాయంటూ అంగద్‌ బేడీ చమత్కారంగా స్పందించారు. దీంతో లక్షలకుపైగా వ్యూస్‌నుసాధించాయీ ఫోటోలు. అభినందనల వెల్లువ కురుస్తోంది. అద్భుతమైన  జంటకు కంగ్రాట్స్‌..మరో అందమైన ప్రేమకథకు ఆరంభం అంటూ బాలీవుడ్‌  దర్శకుడు కరణ్‌​ జోహార్‌ విషెస్‌ చెప్పారు .మరోవైపు ముంబైలో అట్టహాసంగా జరుగుతున్న లాక్మే ఫ్యాషన్‌ వీక్‌2018లో నేహా దూపియా, అంగద్ బేడి తళుక్కున మెరిసారు.  మ్యాచింగ్‌ సాంప్రదాయ దుస్తుల్లో  అక్కడున్న వారిని మెస్మరైజ్‌ చేశారు. చేతిలో చేయివేసుకొని ర్యాంప్‌పై వాక్‌ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

చాలాకాలం డేటింగ్ అనంతరం  నేహా దుపియా, అంగద్‌ బేడీ ఈ ఏడాది మే 10న ఆకస్మాత్తుగా వివాహం చేసుకోవడం  హాట్‌ టాపిక్‌గా నిలిచింది. నేహా గర్భం దాల్చడం వల్లే హడావిడిగా పెళ్లి చేసుకొన్నారనే వార్లు మీడియాలో గుప్పుమన్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా