ఇదే చివరి ముద్దు: నటి

3 Jan, 2020 10:27 IST|Sakshi

ప్రముఖ నటి నేహా పెండ్సే పెళ్లి సమయం సమీపిస్తోంది. ఇక ఆమె సింగిల్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో నేహా పెండ్సే ఈ కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా ప్రారంభించింది. తనకు కాబోయే భర్తకు గాఢంగా ముద్దుపెడుతూ లోకాన్ని మరిచిపోయిన నేహా ‘లాస్ట్‌ సింగిల్‌ గర్ల్‌ కిస్‌’ అంటూ దానికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.  ఇక తన పెళ్లి గురించి చెప్తూ సిగ్గుల మొలకవుతోంది. ‘ప్రస్తుతం నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను కోరుకున్న వ్యక్తితో మనువాడి కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నాను. అక్కడ అందమైన వ్యక్తుల మధ్యకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను. అసలు ఇప్పుడు నాకు కలుగుతున్న ఫీలింగ్‌ నా జీవితంలోనే గొప్పది’ అంటూ సంతోషంలో తేలియాడుతోంది.

కాగా నేహా పెండ్సే ప్రముఖ బిజినెస్‌మెన్‌ షాదుల్‌ సింగ్‌తో గతేడాది ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులక్రితం పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో నేహా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను నేహా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంది. ఇక ‘కేప్టన్‌ హౌస్‌’ షోతో బుల్లితెరకు పరిచయమైన నేహా తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఎన్నో హిట్‌ షోలతో పాటు బిగ్‌బాస్‌ 12 హిందీలోనూ తళుక్కున మెరిసింది. తెలుగులో కేవలం సొంతం, వీధి రౌడీ చిత్రాల్లో మాత్రమే నటించింది. నేహా పెండ్సే జనవరి 5న పెళ్లికి సిద్ధమవుతుండగా ఏప్రిల్‌లో హనీమూన్‌ వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా