చుట్టూ జనం.. మధ్యలో మనం

23 Apr, 2018 00:26 IST|Sakshi
రవితేజ

కాస్త కూల్‌గా కనిపించాడు కదా అని నేలటిక్కెట్‌లాంటోడిని గెలికితే ఉరుకుంటాడా? మడతెట్టేస్తాడు. ఒంట్లో ఒక్కొక్క నరాన్ని మెళిపెట్టేలా బాదేస్తాడు. ఆ అబ్బాయిలైఫ్‌లో ఓన్లీ మాస్‌ యాంగిలేనా? లవ్‌ యాంగిల్‌ లేదా? అనే డౌట్‌ అస్సలు అక్కర్లేదు. అన్ని యాంగిల్స్‌ దండిగా ఉన్నాయి. ‘చుట్టూ జనం.. మధ్యలో మనం’ అనే కాన్సెప్ట్‌తో హ్యాపీ ౖలైఫ్‌ను లీడ్‌ చేయాలనే కోరిక ఉంది.

ఆలోచిస్తే అబ్బాయిలో మాస్‌ ప్లస్‌ క్లాస్‌ లక్షణాలు ఉన్నాయనిపిస్తోంది కదూ! మరి.. ఈ అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే. రవితేజ హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్వకత్వంలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ‘నేల టిక్కెట్టు’ చిత్రం టీజర్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు. టీజర్‌ చూస్తుంటే రవితేజ ఎనర్జీ మార్క్‌ పక్కాగా కనిపిస్తోంది. ‘నేల టిక్కెట్టు’ చిత్రాన్ని మే 24న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు