గొడవేంటి?

12 Mar, 2018 04:40 IST|Sakshi
రవితేజ

వచ్చి, పోయే ప్రయాణికులతో రద్దీగా ఉందా రైల్వేస్టేషన్‌. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చారు హీరో రవితేజ. అప్పటి వరకూ ఫ్రెండ్స్‌తో సరదాగా జోకులేస్తున్న రవితేజ సడన్‌గా ఒకరితో గొడవ పడ్డారు. అసలు... గొడవేంటి? రవితేజ రైల్వేస్టేషన్‌కు ఎందుకు వెళ్లారు? అన్న అంశాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది.

మాళవిక శర్మ కథానాయిక. ఈ చిత్రానికి ‘నేల టిక్కెట్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. రీసెంట్‌గా జరిగిన ఈ సినిమా షెడ్యూల్‌లో రైల్వేస్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో  మాళవిక శర్మ, అలీ పాల్గొన్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు రాజకీయనాయకుడి పాత్రలో, నటుడు సంపత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు