జ్యోతికకు బదులు నిత్యామీనన్‌

9 Feb, 2017 02:51 IST|Sakshi
జ్యోతికకు బదులు నిత్యామీనన్‌

రాజకీయాల్లో ముఖ్యమంత్రి రాజీనామా, ఆ తర్వాత రాజీనామా వెనక్కు అంటూ జరిగే అనూహ్య పరిణామాల్లాగే చిత్రరంగంలోనూ అనుకోని మలుపులు జరుగుతుంటాయి. అట్లీ దర్శకత్వంలో విజయ్‌ నటించనున్న 61వ చిత్రంలో సమంత, కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ముఖ్య కథాపాత్రకు జ్యోతిక వద్ద కథ చెప్పి ఓకే పొందారు అట్లీ. ఆ తర్వాత జ్యోతిక తన పాత్రలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరగా దాన్ని దర్శకుడు అంగీకరించలేదు. దీంతో ఆ చిత్రం నుంచి జ్యోతిక వైదొలగారు.

 తర్వాత ఎవరిని ఒప్పందం చేసుకోవాలనే విషయంలో సందిగ్ధం ఏర్పడింది. ఆ తర్వాత అసిన్, సిమ్రాన్, విద్యాబాలన్‌ పేర్లు ప్రసావనకు వచ్చాయి. అసిన్‌ను అట్లీ సంప్రదించగా ఆమె మళ్లీ నటనపై ఆసక్తి చూపలేదని సమాచారం. ప్రస్తుతం ఆ అవకాశం నిత్యామీనన్‌ను వరించింది. ఈ కథ విని నటించేందుకు ఒప్పుకున్నారామె. నిత్యామీనన్‌ మాత్రం అనుష్క, సమంత, నయనతార వంటి జంట తారల చిత్రాల్లోనే నటిస్తున్నారు. చివరిగా ఆమె ఇరుముగన్‌ చిత్రంలో నటించారు.

సోలో హీరోయిన్‌గా నటించేందుకు నిత్య ఒప్పుకున్నప్పటికీ అరుదుగానే అవకాశాలు లభిస్తున్నాయి. ‘మీరు కాస్తా లావుగా ఉండడంతో హీరోయిన్‌ అవకాశాలు రావడం లేదు, కొంచెం స్లిమ్‌గా మారితే బాగుంటుంది’ అని నటుడు లారెన్స్‌ సలహా ఇచ్చారు. దీంతో ఆమె సన్నబడేందుకు రోజూ వ్యాయామం చేస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆమెకు అట్లీ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించే అవకాశమే లభించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా