యాక్షన్‌.. థ్రిల్‌

16 Apr, 2018 00:51 IST|Sakshi
శేఖర్‌ వర్మ, వివియా

శేఖర్‌ వర్మ, వివియా, విద్యలు హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు సతీష్‌ రేగళ్ల రూపొందిస్తున్న ఫ్యామిలీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నివాసి’. గాయత్రి, దత్తాత్రేయా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై కె.యన్‌. రామారావు, టి.వి.వి.యస్‌.యన్‌. వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 75% షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ఈ నెల 17న స్టార్ట్‌ కానుంది.

ఈ సందర్భంగా  సతీష్‌ మాట్లాడుతూ– ‘‘హీరో శేఖర్‌ నటించిన ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ సినిమా చూశాను. చాలా బాగా చేశాడు. అతన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాసుకున్నాను. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో థ్రిల్‌కి గురి చేసేలా సినిమా ఉంటుంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తాం’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్‌–
అర్జున్, కెమెరా: చిట్టిబాబు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా