యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘నో పెళ్లి’

26 May, 2020 11:37 IST|Sakshi

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడదులై ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ థీమ్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘నో పెళ్లి’ వీడియో సాంగ్‌ను చిత్రయూనిట్‌ విడుదలచేసింది. 

బ్యాచ్‌లర్‌ జీవితమే గొప్పదంటూ, పెళ్లి చేసుకోవద్దంటూ ఈ పాటలో మెగా మేనల్లుడు సాయి తేజ్‌ తెలుపుతున్నాడు. ఇక ఈ పాటలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, ఈ మధ్యనే బ్యాచ్‌లర్‌ జీవితానికి ముగింపు పలికిన రానా దగ్గుబాటి కనిపించడం విశేషం. రఘురామ్‌ లిరిక్స్‌ అందించగా అర్మాన్‌ మాలిక్‌ ఆలపించగా యశ్వంత్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశాడు. 

క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు.  యువతకు బాగా కనెక్ట్‌ అయిన ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ‘నో పెళ్లి’ పాట విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం మరో విశేషం. అంతేకాకుండా ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌లో ఈ పాట కొనసాగుతోంది. 

చదవండి:
జ్యోతికకు రాధిక అభినందనలు
ద‌ర్శ‌కుడి ఇంట్లో ఇద్ద‌రికి క‌రోనా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు