టెంపర్ చూపేందుకు...

28 Nov, 2014 01:15 IST|Sakshi
టెంపర్ చూపేందుకు...

ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘టెంపర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని గురువారం విడుదల చేశారు.  ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయే సినిమా ఇది. ఈ సినిమా ద్వారా ఓ కొత్త ఎన్టీఆర్‌ని పూరి ఆవిష్కరించనున్నారు. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తయింది.

డిసెంబర్ రెండోవారంలో పాటల్ని విడుదల చేసి, సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, రమాప్రభ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల.