గోవా టు హైదారాబాద్‌

10 Nov, 2023 00:31 IST|Sakshi
ఎన్టీఆర్

హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా, సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఇటీవల గోవాలో మొదలైన ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయినట్లు తెలిసింది.

ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, జాన్వీ.. ఇలా ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అలాగే ‘దేవర’ నెక్ట్స్‌ షెడ్యూల్‌ డిసెంబరులో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘దేవర పార్ట్‌ 1’ ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.  

మరిన్ని వార్తలు