జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ కుమారుడు!

10 May, 2016 09:10 IST|Sakshi

జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ జనతా గ్యారెజ్ సెట్స్లో సందడి చేశాడు. తండ్రి నటిస్తున్న సినిమా సెట్స్లో తొలి సారిగా చిన్నారి అభయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సాధారణంగా పబ్లిసిటీకి, సినిమా సెట్స్కు  దూరంగా ఉండే తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా కుమారుడికి తోడుగా రావడం మరింత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీంతో ఈ అరుదైన సంబరాన్ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తన ఫేస్ బుక్ పేజీలో ముద్దుల కొడుకు సెట్స్లో హల్ చేసిన ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో తమ అభిమాన హీరో వారసుడి ఫోటోలకు లైక్లు, షేర్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరు మంచి విజయాలతో ఊపుమీద ఉండటంతో షూటింగ్ దశలోనే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడింది.