ఎన్టీఆర్‌పై ఆ వార్త ఫేక్‌

4 Jun, 2018 12:08 IST|Sakshi
భార్య, తనయుడితో జూనియర్‌ ఎన్టీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌కు సంబంధించి ఓ వార్త గతరాత్రి నుంచి సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీప్రణతి పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిందంటూ కొన్ని వెబ్‌సైట్లు హల్‌ చల్‌ చేశాయి. కానీ, చివరకు ఆ వార్త ఫేక్‌ అని తేలింది. తారక్‌ పీఆర్‌ మహేష్‌ కోనేరు కూడా గత రాత్రి తన ట్విటర్‌లో ఆ వార్త నిజం కాదని తేల్చారు. అయితే ఈ విషయంలో గందరగోళంలో ఉన్న కొందరు అభిమానులు మాత్రం ఎన్టీఆర్‌ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పెడుతుండటం విశేషం. ఇదిలావుంటే ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో అరవింద సమేత చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మూడో షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు