అయ్యో.. ఐదో పెళ్లి కూడా పెటాకులేనా!

3 Feb, 2020 14:59 IST|Sakshi

‘బేవాచ్‌’ సీరియల్‌ స్టార్‌ పమేలా ఆండర్సన్‌ ప్రముఖ నిర్మాత జాన్‌ పీటర్స్‌ను ఇటీవల వివాహమాడిన సంగతి తెలిసిందే. వారి పెళ్లి విషయం తెలిసి హాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. కారణం వారి వయసుతో పాటు పమేలాకు ఇది వరకే నలుగురితో వివాహం జరిగింది. మాజీ ప్రేమికులైన వీరిద్దరూ జనవరి 20న పెళ్లి చేసుకోవడంతో హాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారారు. ఇప్పటికీ వారి పెళ్లి వార్త హాట్‌ టాపిక్‌గా ఉన్న తరుణంలో ఈ కొత్త జంట అందరికీ మరో షాకిచ్చింది. తన భర్త జాన్‌ నుంచి విడిగా ఉంటున్నట్లు తాజాగా పమేలా ప్రకటించడంతో అందరూ కంగుతిన్నారు. ఏమైందా అని జుట్టు పీక్కుంటున్నారు. (చదవండిఆమెకు ఐదు, ఆయనకు ఆరో పెళ్లి)

ఈ విషయంపై పమేలా వివరణ ఇస్తూ.. ‘జీవితంలో ఒకరి నుంచి ఒకరం ఏమి కోరుకుంటున్నామనేది తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ఈ విషయంపై స్పష్టత కోసమే కొంత కాలం దూరంగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు. కాగా వారి వివాహ సర్టిఫికేట్‌ కూడా ఇంకా దరఖాస్తు చేసుకోకపోవడంతో జాన్‌‌, పమేలాలు శాశ్వతంగా విడిపోయారేమోనని హాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు.  జాన్‌ పీటర్స్‌, పమేలాలు 30 ఏళ్ల క్రితం ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 74 ఏళ్ల జాన్‌ తన పాత ప్రియురాలు పమేలాను ఆరవ వివాహం చేసుకున్నాడు. అయితే పమేలాతో విడిపోవడంపై జాన్‌ ఇంతవరకు స్పందించలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా