యాడ్ కోసం పవన్ వాయిస్ ఓవర్

29 Feb, 2016 18:53 IST|Sakshi
యాడ్ కోసం పవన్ వాయిస్ ఓవర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ యాడ్ ఫిల్మ్కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. మానవ జాతిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ రూపొందుతున్న ఓ యాడ్కి వాయిస్ ఇచ్చేందుకు పవన్ అంగీకరించారని తెలుస్తోంది. త్వరలో ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అవుతుందట.   

ప్రజల్లో మార్పు వస్తుందనే చిన్న ఆశతోనే పవన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందు జాగ్రత్త చర్యలు, కొన్ని చెడు అలవాట్లను మానుకోవడం వంటి అంశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ యాడ్ను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ యాడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తారు.

ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.