కొంచెం లైట్ గురూ!

17 Sep, 2016 00:34 IST|Sakshi
కొంచెం లైట్ గురూ!

 ఒక మామూలు డ్రెస్ వేసుకోవడానికి ఎంత టైమ్ పడుతుంది? మహా అయితే రెండు, మూడు నిముషాలు. ప్యాంటు, చొక్కా అయితే అంత టైమ్ కూడా పట్టకపోవచ్చు. చీర అంటే కనీసం ఐదు నిముషాలైనా పడుతుంది. అదే కొంచెం గ్రాండ్‌గా డ్రెస్ చేసుకోవాలంటే మాత్రం మినిమమ్ అరగంటైనా కేటాయించాల్సిందే. ఇప్పుడీ లెక్కలు ఎందుకంటే... ఇటీవల విడుదలైన ‘మొహెంజొ దారో’ సినిమాలో వేసుకున్న ఒక్కో కాస్ట్యూమ్ కోసం పూజా హెగ్డే 25 నిముషాలపైనే వెచ్చించారట.
 
  ఆ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ- ‘‘నేను నెక్ట్స్ చేయబోయే సినిమాలో హాయిగా జీన్స్, టీ షర్ట్స్ ఉంటే బాగుంటుందనుకుంటున్నా. అవైతే వేసుకోవడానికి చాలా ఈజీ. సెకన్లలో రెడీ అయిపోవచ్చు. ‘మొహెంజొ దారో’ నన్ను కొంచెం కష్టపెట్టింది. వేసుకున్న డ్రెస్, పెట్టుకున్న నగలు అన్నీ బరువుగా ఉండేవి. ఒక్కో కాస్ట్యూమ్‌కి ఎక్కువ టైమ్ కేటాయించాల్సి వచ్చింది. అయినా నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే, ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. నటిగా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం. కానీ, ఇమ్మీడియట్‌గా ఇలాంటి సినిమా అంటే కష్టమవుతుంది.
 
 అందుకే తేలికగా ఉండే క్యారెక్టర్, లైట్‌గా ఉండే కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుందనుకుంటున్నా’’ అన్నారు. తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ తర్వాత వేరే చిత్రాలు కమిట్ కాలేదీ బ్యూటీ. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డి.జె. దువ్వాడ జగన్నాథమ్’లో కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో ఆమె కోరుకుంటున్నట్లుగా బబ్లీ క్యారెక్టర్ అయ్యుంటుంది.