నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

16 Aug, 2019 07:46 IST|Sakshi

సినిమా: సంచలనాలకు చిరునామా సమంత. పాకెట్‌ మనీ కోసం చిన్నచిన్న వేడుకల్లో సహాయ కార్యక్రమాలు చేస్తూ నటిగా మారింది ఈ బ్యూటీ. బానాకాత్తాడి చిత్రంతో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసినా, తెలుగులో నటించిన ఏ మాయచేసావే చిత్రంతో విజయాన్ని అందుకుంది. తరువాత తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోలతో నటిస్తూ హిట్‌ చిత్రాల నాయకిగా రాణిస్తున్నారు. తమిళంలో విజయ్, సూర్య, విశాల్, ధనుష్, విజయ్‌సేతుపతి, శివకార్తికేయన్‌లతోనూ నటించారు. ఇటీవల హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈ బ్యూటీ నటించిన ఓ బేబీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. సినిమా విషయాలను పక్కన పెడితే సమంత తెలుగులో తొలి హీరో నాగచైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సమంత గర్భం దాల్చినట్లు, దీంతో నటనకు సుమారు ఒకటిన్న ఏడాది బ్రేక్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమంత కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నటిస్తున్న 96 చిత్రం తరువాత మరో చిత్రాన్ని అంగీకరించలేదన్నది వాస్తవమే. అయితే ఈ విషయమై నటి సమంత ఇంకా స్పందించలేదు. కానీ మంచి విజయాలతో సాగుతున్న పరిస్థితుల్లో నటజీవితానికి సమంత విరామం ఇస్తుందని భావంచలేం. అదీగాక ఇప్పుడే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇకపై ఆ తరహా వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలనుకుంటున్నట్లు ఈ భామ ఇటీవలే తెలిపారు. అలాంటిది పిల్లలను కనాలనే ఆలోచనను సమంత ఇంత త్వరగా తీసుకుంటారని ఊహించలేం కూడా. మరో విషయం ఏమిటంటే తన నటించిన ఓ బేబీ చిత్ర విజయంతో తన పారితోషికాన్ని పేంచేసిందనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. ఇలా తన నట జీవితం ఉజ్వలంగా సాగుతున్న తరుణంలో బ్రేక్‌ తీసుకోవాలని ఏ నటి కోరుకోదు. అలాంటిది నటి సమంత గురించి ఇలాంటి ప్రచారం జరగడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. వదంతులను ఎంజాయ్‌ చేసే సమంత తన గర్భం దాల్చాననే ఈ విషయంపై వెంటనే స్పందిస్తారా అనేది వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు