భయం మళ్లీ మొదలు

18 Oct, 2018 00:27 IST|Sakshi
నందితా శ్వేత

సుధీర్‌బాబు, నందిత జంటగా వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్‌’ ప్రేక్షకుల్ని భయపెట్టడంతో పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. 2013లో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’ తెరకెక్కుతోంది. ‘బ్యాక్‌ టు ఫియర్‌’ అన్నది ఉపశీర్షిక. సుమంత్‌ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ నందితా శ్వేత హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో హరి కిషన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్‌.పి.ఎ. క్రియేషన్స్‌పై ఆర్‌. సుదర్శన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విజయదశమి సందర్భంగా విడుదల చేశారు.

సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే కథ. మా బ్యానర్‌లో మరో సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటికే 90% షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల 22 నుంచి బ్యాలెన్స్‌ ఉన్న రెండు పాటలు, క్లయిమాక్స్‌ని చిత్రీకరించి, నవంబర్‌ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి. రాం ప్రసాద్, సంగీతం: జె.బి, సహ నిర్మాతలు: ఆయుష్‌ రెడ్డి, ఆర్‌పి అక్షిత్‌ రెడ్డి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు