చక్కనమ్మ ఏ చీర కట్టినా అందమే..

16 Apr, 2018 12:14 IST|Sakshi

ముంబై : ఒక్క కనుసైగతో సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారింది మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్‌. ఆమె నటించిన ‘ఒరు అదార్‌ లవ్‌’  సినిమా విడుదల కాకముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఏం చేస్తుందో తెలుసుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో ఉండడం సహజమే. అందుకే ప్రియా వారియర్‌ కూడా అభిమానులను ఖుషీ చేసేందుకు తనకు సంబంధించిన విషయాలను, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. మలయాళ నూతన సంవత్సరాది ‘విషూ’ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియా వారియర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎరుపు రంగు అంచు ఉన్న క్రీమ్‌ కలర్‌ చీర కట్టుకున్న ప్రియా.. ఎర్రటి బొట్టు పెట్టుకుని పూర్తి సంప్రదాయ వస్త్రాధారణతో అభిమానులను కట్టిపడేశారు.

ప్రియా వారియర్‌ నటించిన రొమాంటిక్‌ డ్రామా ‘ఒరు ఆదర్‌ లవ్‌’ జూన్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమర్‌ లూలు దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో పాటు సియార్‌ షాజహాన్‌, రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌, నూరిన్‌ షరీఫ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Happy vishu!🌼 📸: @mojin_thinavilayil Wearing: @ann_ancy Makeup & hair: pinky Thank you @mithunmithran

A post shared by priya prakash varrier (@priya.p.varrier) on

మరిన్ని వార్తలు