మంచి సినిమా తీశామంటున్నారు

4 Dec, 2023 01:10 IST|Sakshi
కార్తీక్‌ రాజు, సిమ్రాన్‌ చౌదరి, మహేశ్‌ రెడ్డి 

కార్తీక్‌ రాజు

‘‘అథర్వ’ చిత్రానికి ఫుల్‌ పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. ఇంత మంచి ఆదరణ రావడంతో మేం పడ్డ కష్టాన్ని మర్చిపోయాం. మంచి సినిమా తీశామని ప్రేక్షకులు అంటున్నారు.. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న వారికి థ్యాంక్స్‌’’ అని హీరో కార్తీక్‌ రాజు అన్నారు. మహేశ్‌ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్‌ రాజు, సిమ్రాన్‌ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్‌ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొత్త పాయింట్, కొత్త కథ చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందుకే క్లూస్‌ టీమ్‌ నేపథ్యంలో ‘అథర్వ’ తీశాను. ఇంత మంచి విజయాన్నిఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మా సినిమాకు ఇంత మంచి స్పందన  వస్తుందనుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు సుభాష్‌ నూతలపాటి. సిమ్రాన్‌ చౌదరి, నటీనటులు కల్పికా గణేష్, గగన్‌ విహారి, విజయ రామరాజు మాట్లాడారు.

మరిన్ని వార్తలు