5 నిమిషాల పాటకు ఐదు కోట్లా.?

18 Dec, 2017 19:04 IST|Sakshi

సాక్షి, సినిమా: ఒక్క సారి నేమ్‌ అండ్‌ ఫేమ్‌ వచ్చాక వారికిక కనకవర్షమే. పారితోషికం కూడా నిమిషాల లెక్కలో వచ్చి పడుతుంది. ఇందుకు ఉదాహరణ నటి ప్రయాంక చోప్రానే. మాజీ మిస్‌ వరల్డ్, బాలీవుడ్‌ అందాల తార, హాలీవుడ్‌ హాట్‌ స్టార్‌, ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా తిరుగులేని ఐడెంటిటీ ప్రియాంక సొంతం. ఈ బ్యూటీ 2002లో కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా తమిళన్‌ చిత్రంలో నటించారు. ఆ తరువాత ఇక్కడ కనిపించకపోయినా బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిపోయారు. 

అలా ప్రియాంక ఒక పక్క సినిమాలు, మరో పక్క వాణిజ్య ప్రకటనలు అంటూ రెండు చేతులా సంపాదించేస్తున్నారు. ఆ మధ్య హాలీవుడ్‌ చిత్రంలోనూ నటించి ఇండియన్‌ నటిని దాటి వరల్డ్‌ నటి అనిపించుకున్నారు. ప్రస్తుతం నంబర్‌వన్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ప్రియాంక చోప్రా నిమిషానికి కోటి రూపాయల లెక్కన పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారు. ఏమిటి నమ్మశక్యంగా తేదు కదూ కానీ నమ్మితీరాలంటున్నాయి సినీ వర్గాలు. 

అసలు కథేంటంటే సినిమాకు రూ.8 కోట్ల వరకూ పారితోషికం పుచ్చుకుంటున్న ఈ బ్యూటీ ఐదు నిమిషాల పాటలో లెగ్‌ షేక్‌ చేయడానికి ఐదు కోట్లు పారితోషికం డిమాండ్‌ చేశారట. త్వరలో బాలీవుడ్‌లో జరగనున్న ఒక అవార్డుల ప్రధాన వేడుకలో ఒక పాటకు ఆడటానికి ఐదు కోట్లు పారీతోషికం తీసుకోనున్నారన్నది తాజా సమాచారం. ప్రియాంక చోప్రా డాన్స్‌ చేస్తే మంచి ప్రచారం లభిస్తుందని ఆమె అడిగి పారితోషికాన్ని అందించడానికి ఆ కార్యక్రమం నిర్వాహకులు అంగీకరించినట్లు ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. 

దీని గురించి ప్రయాంక చోప్రా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ముంబాయిలో జరగనున్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా నుంచి రానున్నట్లు పేర్కొన్నారు. ఆ వేదికపై ప్రియాంక చోప్రా తాను నటించిన చిత్రాలలోని కొన్ని పాటల సన్నివేశాలను కలిపి ఐదు నిమిషాల పాటు డాన్స్‌ వేయనుందని తెలుస్తోంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు