నాకు డబుల్‌ హ్యాపీ- బి.ఎ. రాజు

8 Jan, 2020 02:44 IST|Sakshi

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ను విడుదల చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ – ‘‘నాతో కలిసి శివ చాలా సినిమాలకు పని చేశాడు. ఫస్ట్‌ టైమ్‌ డైరెక్టర్‌గా సినిమా చేశాడు.. నాకు బాగా కావాల్సినవాడు, చాలా ప్రతిభ ఉన్నవాడు.. తనపై నమ్మకం ఉంది. ‘22’ సినిమా చాలా బాగుంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ సాధించాలి. శివ పెద్ద డైరెక్టర్‌ కావాలి. రూపేష్‌ కుమార్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, మారుతిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శివకుమార్‌ బి. దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘22’.  రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా నటించారు. మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై సుశీలాదేవి నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విలేకరుల సమావేశంలో నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘22’ చిత్రం టాకీని శివ 35 రోజుల్లో పూర్తి చేశాడు. ప్రీ ప్రొడక్షన్‌ని పకడ్బందీగా ప్లాన్‌ చేయడంతో పాటు తన మీద తనకు ఎంతో నమ్మకం ఉండటంవల్లే అంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేయలిగాడు’ అన్నారు. శివకుమార్‌ మాట్లాడుతూ– ‘‘పూరీగారి దగ్గర పనిచేసే అవకాశం ఇచి్చనందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

టీజర్‌ని చూసి మా యూనిట్‌ని ఆయన అభినందించారు. ముఖ్యంగా సాయికార్తీక్‌ నేపథ్య సంగీతానికి బాగా ఇంప్రెస్‌ అయ్యారు’’ అన్నారు. ‘‘మా అబ్బాయి శివకి రూపే‹Ùలాంటి హీరో, ప్రొడ్యూసర్‌ దొరకడం అదృష్టం. మా అబ్బాయి శివ దర్శకుడు అయితే, మా అన్నయ్యగారి అబ్బాయి రవికిరణ్‌ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌.. ఇద్దరూ ఒకే సినిమాకి చేయడం నాకు డబుల్‌ హ్యాపీ’’ అన్నారు నిర్మాత బి.ఎ.రాజు. ‘‘సాయికార్తీక్‌ నేపథ్య సంగీతం బాగా చేశారు. రవికిరణ్‌గారు మంచి విజువల్స్‌ ఇచ్చారు. షూటింగ్‌ అంతా చాలా సజావుగా జరిగింది’’ అన్నారు రూపే‹Ùకుమార్‌ చౌదరి. కెమెరామేన్‌ రవికిరణ్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఆర్ట్‌ డైరెక్టర్‌ పెద్దిరాజు మాట్లాడారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా