నా నమ్మకం నిజమైంది

25 Nov, 2019 05:54 IST|Sakshi
శ్రీనివాస రెడ్డి, సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ కానూరి

– శ్రీనివాసరెడ్డి

ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేష్‌ వెంకట్రామన్, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్‌ కానూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసి కాస్త నిరాశకు లోనయ్యాం. కానీ శనివారం మార్నింగ్‌ షో, మ్యాట్నీ షోలు హౌస్‌ఫుల్‌ అవ్వడం, అన్ని చోట్ల కలెక్షన్స్‌ కూడా బాగుండటంతో చాలా హ్యాపీ ఫీలయ్యాం. సినిమా చూసినవాళ్లు బాగుంది చూడమని ఇంకో పదిమందికి చెబుతున్నారు. నేను ఏదైతే నమ్మి సినిమాను తీశానో అది నిజమైంది.

బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ టూర్‌ ప్లాన్‌ చేశాం. ఈషా, సత్యదేవ్‌ బాగా నటించారు. శ్రీనివాస్‌ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఆయన బ్యానర్‌లోనే ‘భార్యదేవోభవ’ అనే సినిమాని డైరెక్ట్‌ చేయబోతున్నాను. ఓ ప్రముఖ హీరో నటిస్తారు. పదిమంది హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘విద్య’ పాత్రను బాగా చేశానని చెబుతుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘థ్రిల్లర్‌ సినిమాని బాగా గ్రిప్పింగ్‌గా తీశాడని కె.రాఘవేంద్రరావుగారు ఫోన్‌ చేసి చెప్పడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు శ్రీనివాస్‌ కానూరి. సత్యదేవ్, సంగీత దర్శకుడు రఘు కుంచె, గణేష్‌ వెంకట్రామన్, రవివర్మ, ముస్కాన్, కెమెరామన్‌ అంజి మాట్లాడారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పక్కా లోకలైపోదాం!

డబుల్‌ ధమాకా

'మంచు'వారి సాయం

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

సినిమా

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్