కమల్‌హాసన్ కూతురితో డేటింగ్.. ఇప్పుడు మరో అమ్మాయితో నిశ్చితార్థం!

20 Nov, 2023 18:47 IST|Sakshi

మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయాడు. తనకు నిశ్చితార్థం జరిగిపోయిందని చెబుతూ జీవిత భాగస్వామిని పరిచయం చేశాడు. అయితే ఈ కుర్రాడు ఓటీటీల్లో స్టార్ అని చాలామందికి తెలుసు. కానీ ఇతడు తెలుగు హీరోయిన్ కొడుకని మనోళ్లకు పెద్దగా తెలియదు. ఇంతకీ ఈ కుర్రాడెవరు? ఎంగేజ్‌మెంట్ సంగతేంటి?

నటుడు, మోడల్‪‌గా గుర్తింపు తెచ్చుకున్న తనూజ్ విర్వాని.. 2013లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓ మూడు సినిమాలు చేశాడు గానీ పెద్దగా పేరు రాలేదు. కానీ ఓటీటీల్లో చేసిన 'ఇన్ సైడ్ ఎడ్జ్' సిరీస్ వల్ల ఇతడికి బోలెడంత ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కోడ్ M, పాయిజన్, మసాబా మసాబా తదితర సిరీసుల్లో యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

తనూజ్ ఇప్పుడు తాన్య జాకబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశాడు. తనూజ్ తల్లి రతి అగ్నిహోత్రి అప్పట్లో తెలుగు సినిమాలు చేసింది. 1980-82 మధ్యలో దాదాపు 10 వరకు తెలుగు చిత్రాల్లో నటించింది. ఈ లిస్టులో చిరంజీవి 'పున్నమినాగు' కూడా ఉంది. చివరగా తెలుగులో 2016లో వచ్చిన బాలకృష్ణ 'డిక్టేటర్'లో కనిపించింది.

ఇక తనూజ్ విషయానికొస్తే.. కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ తో దాదాపు నాలుగేళ్లు (2013-17) డేటింగ్ చేశాడు. ఆ తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫేమ్ నటి ఇజ్బెల్లాలో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు డేటింగ్, రిలేషన్ లాంటి వాటిని పక్కనబెడుతూ తన కాబోయే భార్యని అందరికీ పరిచయం చేసి షాకిచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయిపోయాయి.

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!)

A post shared by Tanuj Virwani (@tanujvirwani)

మరిన్ని వార్తలు