బాహుబలి ప్రీక్వెల్‌

10 Nov, 2018 01:33 IST|Sakshi
మృణాల్‌ ఠాకూర్

డిజిటల్‌ మాధ్యమంలో నెట్‌ఫ్లిక్స్‌ ఎప్పటికప్పుడు సరికొత్త షోలతో ముందుకొస్తోంది. సొంతంగా సినిమాలనూ రిలీజ్‌ చేస్తోంది. ఈ ఏడాది ఏకంగా ఎనిమిది సినిమాలు, ఒక సిరీస్‌తో రానున్నట్టు పేర్కొంది. రాజమౌళి సూపర్‌ హిట్‌ ఫ్యాంటసీ చిత్రం ‘బాహుబలి’ ప్రీక్వెల్‌ నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్‌గా రూపొందనున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ సిరీస్‌లో నటించే వారిని తాజాగా అనౌన్స్‌ చేసింది. శివగామిగా మృణాల్‌ ఠాకూర్, స్కందదాస్‌గా రాహుల్‌ బోస్, అతుల్‌ కులకర్ణి, అనూప్‌ సోనీ వంటి నటులు ఈ సిరీస్‌లో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ సిరీస్‌ను దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు