చరణ్ కొత్త సినిమా లుక్‌

27 Mar, 2018 10:36 IST|Sakshi

రంగస్థలం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోసం రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు రంగస్థలం సినిమా కోసం డిఫరెంట్ లుక్‌లో కనిపించిన చెర్రీ బోయపాటి సినిమా కోసం సరికొత్త లుక్‌ను ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. తాజా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ కొత్త సినిమా లుక్‌ ను రివీల్ చేశారు.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను బోయపాటి పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా మరోసారి దేవీ ప్రసాద్‌ చరణ్ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ స్టైలిష్‌గా కనిపించనున్నాడు. బోయపాటి మార్క్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రంగస్థలం ప్రమోషన్‌కార్యక్రమాలు పూర్తి  చేసి త్వరలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ కు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు