దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్‌ వర్మ భేటీ

17 Feb, 2020 16:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనను తెరకెక్కించబోతున్న డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ... ఆ దిశగా సన్నాహాలు వేగవంతం చేశారు. వర్మ ఉన్నట్టుండి సోమవారం రోజున రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. అక్కడి ఏసీపీ అశోక్‌కుమార్‌తో భేటీ అయ్యారు. దిశ ఘటనపై ఆయనతో చర్చలు జరిపారు. దిశ  కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెపై అత్యాచారం జరిగినప్పటి నుంచి ఎన్‌కౌంటర్ జరిగిన వరకూ ఉన్న పరిస్థితులు కేసు వివరాలను ఏసీపీ వివరించారు. త్వరలో మరికొందరు పోలీస్‌ అధికారులను కూడా కలుస్తానన్న ఆయన.. సమాచారన్నంతా సేకరించిన తర్వాత తాను  సినిమాలో ఏం చూపించాలన్న దానిపై నిర్ణయానికి వస్తానన్నారు.    చదవండి: దిశ: చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ

దిశ ఘటనపై ఓ సినిమా చేస్తానని ఈ మధ్య ప్రకటించిన నేపథ్యంలో ఆయన పోలీసులను కలడం ఆసక్తిగా మారింది. రామ్‌గోపాల్ వర్మ ఇటీవల దిశ ఘటనపై స్పందించి అత్యాచారానికి పాల్పడిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్‌కౌంటర్‌కు గురైన నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కూడా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సినిమా తీస్తానని ప్రకటించారు. దిశ ఘటన గురించి సమాచారం తెలుసుకోవడానికి తాను శంషాబాద్‌ ఏసీపీని కలిసినట్టు వెల్లడించారు. దిశ సినిమాను తీయడానికి నేను చేస్తోన్న పరిశోధనకు ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ కేసు సంచలనం సృష్టించిందని, ఒక ఎమోషనల్ క్యాప్చర్ చేయాలన్నదే తన ప్రయత్నమని వర్మ చెప్పారు.  చదవండి: వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

>
మరిన్ని వార్తలు