బయటపడిన సంగమేశ్వర ఆలయ గోపురం

17 Feb, 2020 16:22 IST|Sakshi
కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడిన సంగమేశ్వర ఆలయ గోపురం

29 రోజుల్లో పూర్తిగా బయటపడనున్న సంగమేశ్వరుడు

సాక్షి, నందికొట్కూరు: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర ఆలయ గోపురం ఆదివారం కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడింది. సంగమేశ్వర ఆలయం 2019 జూలై రెండో వారంలో కృష్ణమ్మ ఒడిలోకి వెళ్లింది. శ్రీశైలం డ్యాం బ్యాక్‌ వాటర్‌ ఆదివారం 866 అడుగులకు చేరడంతో ఆలయ శిఖరం బయటపడింది. సంగమేశ్వరుడు పూర్తిగా బయటపడాలంటే బ్యాక్‌ వాటర్‌ 837 అడుగులకు రావాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు 29 రోజులు పడుతుందని ఆలయ పురోహితుడు తెల్లకపల్లి రఘురామశర్మ చెప్పారు. (హంస వాహనాధీశా.. హరోం హర)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు