డైలామా ఏం లేదు.. థియేటర్‌లోనే!

12 Apr, 2020 14:56 IST|Sakshi

మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదాపడ్డాయి. వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని టాలీవుడ్‌ దర్శకనిర్మాతలు భారీ ప్రణాళికలు రచించుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఒరేయ్‌ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్‌, వి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే కొన్ని చిన్న సినిమాలు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ చేస్తుండగా.. మరికొన్ని పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు, హీరోలు ఓటీటీ ప్లాట్‌ఫాంపై రిలీజ్‌ చేసేందుకు డైలామాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం రామ్‌ పోతినేని చిత్రం ‘రెడ్‌’.

అన్నీ అనుకున్నట్లు సాగితే ‘రెడ్‌’ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల అయ్యేది. కానీ కుదర లేదు. అయితే దర్శకనిర్మాతలు డిజిటల్‌ బాట వైపు మొగ్గు చూపుతున్నారని, కానీ హీరో రామ్‌ డైలామాలో ఉన్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రామ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు.  ‘అలాంటిదేం లేదు! రామ్‌ ఎలాంటి సందిగ్థంలో లేడు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు. అభిమానులు ‘రెడ్‌’ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు’ అని తెలిపాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటించారు. స్రవంతి మ´వీస్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
బన్ని కోసం బాలీవుడ్‌ నుంచి..
బాలయ్య సినిమాలో లేడీ విలన్‌?

మరిన్ని వార్తలు