విరాటపర్వం ఆరంభం

16 Jun, 2019 03:59 IST|Sakshi
చెరుకూరి సుధాకర్, వెంకటేశ్, వేణు ఉడుగుల, సురేశ్‌బాబు, దివాకర్‌ మణి

అజ్ఞాతవాసం కోసం పూర్వం విరాటరాజు కొలువులో పాండవులు కొలువు దీరి కార్యసిద్ధులయ్యారు. ఇప్పుడు వెండితెరపై రానా ‘విరాటపర్వం’ మొదలైంది. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్‌ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా నటించనున్న ‘విరాటపర్వం’ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై డి. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నటుడు వెంకటేశ్‌ క్లాప్‌ ఇవ్వగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

నిర్మాతలు డి. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరిలు దర్శకుడు వేణు ఉడుగులకు స్క్రిప్ట్‌ అందించారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే వారంలో స్టార్ట్‌ కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, వై. రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్‌ అగర్వాల్, రామ్‌ ఆచంట, దర్శకులు చందు మొండేటి, అజయ్‌ భూపతి, వెంకటేశ్‌ మహా, ఏషియన్‌ సినిమాస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించనున్న ఈ సినిమాకు దివాకర్‌ మణి కెమెరామేన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా