తగ్గడానికి రెడీ

8 May, 2016 23:16 IST|Sakshi
తగ్గడానికి రెడీ

తగ్గడం మొదలు పెడితే నా అంతగా తగ్గేవాళ్లు ఉండరనే రేంజ్‌లో రణబీర్ కపూర్ సవాల్ చేసి మరీ బరువు తగ్గే పనిలో ఉన్నారట. దీనికి గల కారణాన్ని ఊహించే ఉంటారు.  అవును.. ఓ సినిమా కోసమే ఈ పని మొదలుపెట్టారు. సంజయ్‌దత్ జీవితం ఆధారంగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని ఓ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్‌గా రణ్‌బీర్ కపూర్ నటించనున్నారు. ఇందుకోసమే సంజయ్ దత్‌తో చాలా సేపు ఉంటూ ఆయన జీవితంలోని అన్ని పార్శ్వాలను అర్థం చేసుకోవడానికి రణబీర్ ట్రై చేస్తున్నారట.

80 దశకాల్లో సంజయ్‌దత్ ఎలా ఉండేవారో కరెక్ట్‌గా అలాగే తెరపై కనిపించడానికి రణ్‌బీర్ 10 కిలోల బరువు తగ్గనున్నారు. ఆ సీన్స్ చిత్రీకరించాక ఇప్పటి సంజయ్‌లా కనిపించే సీన్స్ కోసం మళ్లీ బరువు పెరుగుతారట.