పాపం.. రష్మికకు లక్కులేదు!

23 Sep, 2019 10:54 IST|Sakshi

 దేనికైనా కాలం కలిసి రావాలి. అలా కలిసొచ్చే రోజు వరకూ వేచి ఉండక తప్పదు. అది ఎవరైనా, ఎంతవారైనా సరే. దాన్నే అదృష్టం అంటారు. ఆ లక్కు లేకుంటే మిగిలేది కిక్కే. సినిమా వారి గురించి చెప్పాలంటే ఒక భాషలో వెలిగిపోతున్నామని మరో భాషలో రాణించాలని లేదు. అందుకూ అదృష్టం ఉండాలి. ఇది ఇక్కడ ప్రస్తావించడానికి కారణం నటి రష్మికనే. ఈ కన్నడ బ్యూటీ గీతగోవిందం చిత్రంతో తెలుగులో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌ అయిపోయింది. ఆ చిత్రం తెలుగు నాటనే కాదు తమిళనాట కూడా మంచి విజయాన్ని సాధించింది. అంతే కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడి పేరు మారుమోగిపోయింది. దీంతో ఇళయదళపతికి జంటగా రష్మిక అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. అలాంటి ప్రసారానికి లోలోన ఆనందించినా పైకి మాత్రం అలా అంచనాలు పెంచేయకండ్రా బాబూ అంటూ రష్మిక అభిమానులకి చెప్పింది. అలా రష్మికపై అభిమానులు ప్రచారానికి మీడియా వంత పాడేసింది. నిజంగానే విజయ్‌తో జతకట్టబోతోందనే ప్రచారం జోరందుకుంది. అయితే అలా జరగలేదు. విజయ్‌ 65వ చిత్రానికి రష్మికను హీరోయిన్‌గా నటింపజేయడానికి చర్చలు జరిగినా, అవి సఫలం కాలేదు. ఇప్పుడు విజయ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి కియారా అద్వానిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ చిత్రం మిస్‌ అయ్యినా కార్తీతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

కాగా మరోసారి తెలుగులో గీతగోవిందం చిత్ర హీరో విజయ్‌దేవరకొండతో కలిసి డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని తమిళంలోనూ డబ్‌ చేసి ఏకకాలంలో విడుదల చేశారు. డియర్‌ కామ్రేడ్‌ చిత్ర ప్రచారంలో భాగంగా చెన్నైకి వచ్చిన రష్మిక పెద్ద హంగామానే చేసింది. ఇంకా చెప్పాలంటే  చాలా ఎక్కువ చేసింది. అయితే డియర్‌ కామ్రేడ్‌ చిత్రం నిరాశ పరచింది. దీంతో కోలీవుడ్‌లో అమ్మడి క్రేజ్‌ తుస్సుమంది. దీంతో ఇక్కడ రష్మికకు కిక్కేనా? లక్కు లేదా? అనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఇప్పుడీ అమ్మడు కార్తీతో నటిస్తున్న చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. అయితే తెలుగులో మాత్రం చాలా డిమాండ్‌ ఉందీ అమ్మడికి. అక్కడ ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటిస్తోంది. మరో రెండు చిత్రాలకు సంతకం చేసింది. ఏమైనా కోలీవుడ్‌లో క్రేజ్‌ తగ్గిపోవడంతో కాస్త బాధగానే ఉందట. ఇక్కడ మరిన్ని అవకాశాలు పొందాలని ఆశ పడుతుందని సమాచారం. దీంతో ఆ ప్రయత్నాలు మొదలెట్టేసిందట. అందులో భాగంగా గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అవి ఇప్పుడు తమిళ వెబ్‌సైట్లలో వైరల్‌ అవుతున్నాయి. ఏదైనా కార్తీతో రొమాన్స్‌ చేస్తున్న చిత్రం విడుదల వరకూ నటి రష్మిక విషయంలో వేచి చూడాలని కోలీవుడ్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నట్లు తాజా సమాచారం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌

‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’

బిగ్‌బాస్‌లో.. గద్దలకొండ గణేష్‌

కూతురితో బన్నీ క్యూట్ వీడియో!

బాలీవుడ్ జేజమ్మ ఎవరంటే?

చిత్ర పరిశ్రమ చూపు.. అనంతపురం వైపు!

నయన్‌ విషయంలోనూ అలాగే జరగనుందా?

మాఫియా టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌

‘కాప్పాన్‌’తో సూర్య అభిమానులు ఖుషీ

సిబిరాజ్‌కు జంటగా నందితాశ్వేత

బిగ్‌బాస్‌ చూస్తున్నాడు.. జాగ్రత్త

కంటే కూతురినే కనాలి

నా ఓపికను పరీక్షించొద్దు : హీరో

రోజాను హీరోయిన్‌ చేసింది ఆయనే

24 గంటల్లో...

ఆస్కార్స్‌కు గల్లీ బాయ్‌

అవార్డు వస్తుందా?

రొమాంటిక్‌ తూటా

నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజు : చిరంజీవి

సంక్రాంతికి మంచివాడు

డేట్‌ ఫిక్స్‌

బ్యాలెన్స్‌ ఉంటే ఏ బ్యాలెన్సూ అక్కర్లేదు

బిగ్‌బాస్‌.. సీక్రెట్‌ రూమ్‌లోకి రాహుల్‌

బిగ్‌షాక్‌.. రాహుల్‌ ఫేక్ ఎలిమినేషన్‌

హిమజ అవుట్‌.. అసలేం జరుగుతోందంటే?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌